Saturday, December 9, 2017

Benefits of Guava :leaves: *జామ ఆకుల‌తో షుగ‌ర్ మాయం

Benefits of Guava
:leaves:


*జామ ఆకుల‌తో షుగ‌ర్ మాయం.*.!



:large_blue_circle: *జామ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిల్లో విట‌మిన్ సి స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి, అధిక బ‌రువు త‌గ్గుతారు. ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు జామ కాయ‌ల వ‌ల్ల మ‌న‌కు క‌లుగుతాయి. అయితే జామ కాయ‌లే కాదు, జామ ఆకుల వ‌ల్ల కూడా మ‌నం ప‌లు అనారోగ్య స‌మస్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.*

1):leaves: *జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. జామ ఆకులు నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి పోతుంది. విరేచ‌నాలు, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి.*

2):leaves: *జామాకుల్ని తినటం వల్ల దంతాలకు ఆరోగ్యంతో పాటు నోటిలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది.* *నోటిలో ఉండే పొక్కులు పోతాయి. నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది.*

3) *:leaves: జామఆకులతో టీ చేసుకొని తాగితే చక్కని ఫలితం ఉంటుంది.రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా జామ ఆకులు నియంత్రిస్తాయి. అంతే కాకుండా జామాకులతో చేసిన టీ తాగటం వల్ల శ్వాసకోస సంబంధమైన సమస్యలు పోతాయి. దగ్గు తగ్గిపోతుంది.*


4):leaves: *జామ ఆకుల్లో విటమిన్‌- బి పుష్కలంగా ఉంటుంది. విటవిన్‌ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. బి3, బి5, బి6 విటమిన్లు చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి.*


5) *:leaves:గుప్పెడు జామాకుల్ని లీటరు నీటిలో 20 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ల వరకూ అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు తలెత్తవు. దీంతో పాటు జుట్టు కుదుళ్లు దృఢంగా తయారవుతాయి.*

పెరుగు తినడం వల్ల ఉపయోగాలు Advantages of eating Curd (Dahi)

పెరుగు తినడం వల్ల ఉపయోగాలు
Advantages of eating Curd (Dahi)


చ‌క్క‌ని రుచి క‌లిగి ఉండే గ‌డ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రు భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో తినంది అసలు తృప్తి చెంద‌రు. భోజనం అయిపోన‌ట్టుగానే భావిస్తారు. కానీ కొంత‌మందికి పెరుగు కాదు క‌దా, పాలు దాని సంబంధ ప‌దార్థాలు అస్స‌లు న‌చ్చ‌వు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఉప‌యోగాల గురించి తెలిస్తే పెరుగంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని వాడేందుకు ఆస‌క్తి చూపుతారు. ఎందుకంటే దాంతో అన్ని ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి మ‌రి. ఆ ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.

2. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.

3. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

4. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.

5. ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

6. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.

7. పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

8. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.

9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.

10. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి.

మెంతులు చేసే మేలు Benefits of Fenugreeek


మెంతులు చేసే మేలు
Benefits of Fenugreeek (Methi)


1. స్థూలకాయానికి

ఒక కప్పు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూను మెంతి పొడిని వేసి ఒక ఐదు నిముషాలు మూత పెట్టి ఉంచాలి. మెంతి పొడిని వదకట్టుకుని ఆ టీ ప్రతిరోజూ తాగడం వలన స్థూలకాయం సమస్య తగ్గుతుంది.

2. నవయవ్వనమైన చర్మ కాంతికి

మెంతి పొడిని పెరుగులో కలిపి ముఖానికి పాక్ లా వేసుకుని ఒక ఇరవై నిముషాల తర్వాత శుభ్రం చేసుకున్నట్లైతే చర్మం మీది ముడతలు తగ్గుతాయి. మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

3. ఋతు సమస్యలకు

అరచెంచా మెంతి పొడిని పరకడుపుతో వేడినీటిలో కలిపి తీసుకోవడం వలన ఋతు సమస్యలు తొలగుతాయి. నెలసరి క్రమంగా వస్తుంది. అంతేకాక నెలసరి సమయం లో వచ్చే కడుపునొప్పి కూడా నివారించబడుతుంది.

4. కాలిన గాయాలకు

నిప్పు వల్ల లేదా మంటల వల్ల పొరపాటున అగ్ని ప్రమాదం జరిగి గాయాలు అయినప్పుడు వెంటనే మెంతుల ను ఉపయోగించవచ్చు. మెంతుల ను మెత్తగా గుజ్జులా నూరి కాలిన చోట పట్టు వేస్తె క్షణాల్లో మంట తగ్గిపోయి బొబ్బలెక్కకుండా ఉంటుంది. అంతే కాకుండా రోజూ రెండు పూటలా ఇలా చేస్తుంటే కాలిన గాయాలు కూడా త్వరగా ఆరిపోయి మానిపోతాయి.

5.  వాపులకు మెంతులు

దెబ్బల వల్ల గాని, వాయు దోషాల వల్ల గాని మోకాళ్ళు, చీలు మండలు మొదలైన చోట్ల వాపులు కలిగినప్పుడు వంటింటి మెంతులు వజ్రాయుధంలా పనిచేస్తాయి. మెంతుల్ని ఒక పగలు నీటిలో నానబెట్టి రాత్రి గుజ్జులా నూరి వాపుల పైన దట్టం గా పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతుండాలి. ఇలా విడవకుండా చేస్తుంటే వాపులు, నొప్పులు హరించిపోతాయి.

6. వేడికి మెంతులు

ఒంట్లో అతిగా వేడి ఉన్న వారు తిన్న ఆహారం ఒంటబట్టక ఎండిపోయి నల్లగా మారిపోతారు. అలాంటి వారు ఒక కప్పు పెరుగులో ఒక చెంచా మెంతులను రాత్రి పూట వేసి, ఉదయం వరకు నానబెట్టి పరగడుపున మెంతులతో పాటు పెరుగు కుడా తింటుంటే శరీరం లో ఉన్న వేడి తగ్గిపోతుంది.

7. కాంతివంతమైన ఒత్తైన జుట్టుకోసం

మెంతులు జుట్టుకు అద్భుతమైన పోషకాలు. మెంతులను రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే రుబ్బి తలకు పట్టించుకుని ఒక అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల చుండ్రు వంటివి నివారించబడి, జుట్టు ఒత్తుగా, బలంగా, కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు జుట్టు వేగంగా పెరుగుతుంది. చిన్న తనంలో జుట్టు తెల్లబడటం తగ్గుతుంది.

8. విరోచనాలకు

విరోచానాలు అవుతున్నప్పుడు ఒక స్పూను పెరుగుకు చిటికెడు మెంతుల చొప్పున, వెంటవెంటనే మూడు సార్లు తీసుకోవాలి. గంటకు ఒకసారి ఇలా చేయడం వల్ల విరోచనాలు తగ్గుతాయి.

9. సకల వాత నొప్పులకు మెంతుల తైలం

మెంతులు 100 గ్రాములు

నువ్వులు. 100 గ్రాములు

నల్ల జీలకర్ర. 100 గ్రాములు

అన్నింటిని తీసుకొని నీటిలో నానబెట్టి. మెత్తగా రుబ్బి ఆ గుజ్జును కళాయి పాత్ర లో పోయాలి.అందులో నువ్వుల నూనె 600 గ్రాములు కలిపి చిన్న మంట పైన నూనె మిగిలే వరకు మరిగించి దించి వడబోసి నిలువ చేసుకోవాలి. ఈ తైలాన్ని నొప్పుల పైన గోరువెచ్చగా మర్దన చేస్తూ ఉంటే పక్షవాతం, కీళ్ళ వాతం, నడుము నొప్పులు . మెడల నొప్పులు వంటి అన్ని రకాల వాత వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి

Waste Segregation: One Bin for Each, One Step Toward a Cleaner Future

  Waste Segregation: One Bin for Each, One Step Toward a Cleaner Future Urbanization and fast-paced lifestyles have increased the amount of...