మెంతులు చేసే మేలు
Benefits of Fenugreeek (Methi)
ఒక కప్పు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూను మెంతి పొడిని వేసి ఒక ఐదు నిముషాలు మూత పెట్టి ఉంచాలి. మెంతి పొడిని వదకట్టుకుని ఆ టీ ప్రతిరోజూ తాగడం వలన స్థూలకాయం సమస్య తగ్గుతుంది.
2. నవయవ్వనమైన చర్మ కాంతికి
మెంతి పొడిని పెరుగులో కలిపి ముఖానికి పాక్ లా వేసుకుని ఒక ఇరవై నిముషాల తర్వాత శుభ్రం చేసుకున్నట్లైతే చర్మం మీది ముడతలు తగ్గుతాయి. మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
3. ఋతు సమస్యలకు
అరచెంచా మెంతి పొడిని పరకడుపుతో వేడినీటిలో కలిపి తీసుకోవడం వలన ఋతు సమస్యలు తొలగుతాయి. నెలసరి క్రమంగా వస్తుంది. అంతేకాక నెలసరి సమయం లో వచ్చే కడుపునొప్పి కూడా నివారించబడుతుంది.
4. కాలిన గాయాలకు
నిప్పు వల్ల లేదా మంటల వల్ల పొరపాటున అగ్ని ప్రమాదం జరిగి గాయాలు అయినప్పుడు వెంటనే మెంతుల ను ఉపయోగించవచ్చు. మెంతుల ను మెత్తగా గుజ్జులా నూరి కాలిన చోట పట్టు వేస్తె క్షణాల్లో మంట తగ్గిపోయి బొబ్బలెక్కకుండా ఉంటుంది. అంతే కాకుండా రోజూ రెండు పూటలా ఇలా చేస్తుంటే కాలిన గాయాలు కూడా త్వరగా ఆరిపోయి మానిపోతాయి.
5. వాపులకు మెంతులు
దెబ్బల వల్ల గాని, వాయు దోషాల వల్ల గాని మోకాళ్ళు, చీలు మండలు మొదలైన చోట్ల వాపులు కలిగినప్పుడు వంటింటి మెంతులు వజ్రాయుధంలా పనిచేస్తాయి. మెంతుల్ని ఒక పగలు నీటిలో నానబెట్టి రాత్రి గుజ్జులా నూరి వాపుల పైన దట్టం గా పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతుండాలి. ఇలా విడవకుండా చేస్తుంటే వాపులు, నొప్పులు హరించిపోతాయి.
6. వేడికి మెంతులు
ఒంట్లో అతిగా వేడి ఉన్న వారు తిన్న ఆహారం ఒంటబట్టక ఎండిపోయి నల్లగా మారిపోతారు. అలాంటి వారు ఒక కప్పు పెరుగులో ఒక చెంచా మెంతులను రాత్రి పూట వేసి, ఉదయం వరకు నానబెట్టి పరగడుపున మెంతులతో పాటు పెరుగు కుడా తింటుంటే శరీరం లో ఉన్న వేడి తగ్గిపోతుంది.
7. కాంతివంతమైన ఒత్తైన జుట్టుకోసం
మెంతులు జుట్టుకు అద్భుతమైన పోషకాలు. మెంతులను రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే రుబ్బి తలకు పట్టించుకుని ఒక అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల చుండ్రు వంటివి నివారించబడి, జుట్టు ఒత్తుగా, బలంగా, కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు జుట్టు వేగంగా పెరుగుతుంది. చిన్న తనంలో జుట్టు తెల్లబడటం తగ్గుతుంది.
8. విరోచనాలకు
విరోచానాలు అవుతున్నప్పుడు ఒక స్పూను పెరుగుకు చిటికెడు మెంతుల చొప్పున, వెంటవెంటనే మూడు సార్లు తీసుకోవాలి. గంటకు ఒకసారి ఇలా చేయడం వల్ల విరోచనాలు తగ్గుతాయి.
9. సకల వాత నొప్పులకు మెంతుల తైలం
మెంతులు 100 గ్రాములు
నువ్వులు. 100 గ్రాములు
నల్ల జీలకర్ర. 100 గ్రాములు
అన్నింటిని తీసుకొని నీటిలో నానబెట్టి. మెత్తగా రుబ్బి ఆ గుజ్జును కళాయి పాత్ర లో పోయాలి.అందులో నువ్వుల నూనె 600 గ్రాములు కలిపి చిన్న మంట పైన నూనె మిగిలే వరకు మరిగించి దించి వడబోసి నిలువ చేసుకోవాలి. ఈ తైలాన్ని నొప్పుల పైన గోరువెచ్చగా మర్దన చేస్తూ ఉంటే పక్షవాతం, కీళ్ళ వాతం, నడుము నొప్పులు . మెడల నొప్పులు వంటి అన్ని రకాల వాత వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి

No comments:
Post a Comment