Tuesday, July 30, 2019

Benefits of Eating Tamarind Leaves చింతచిగురు


Image result for చింతచిగురు

Benefits of Eating Tamarind Leaves
 చింతచిగురు

జూన్లో దొరికే చింత చిగురును మిస్ చేసుకోకండి… దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…
----------------------------------------
చింత చచ్చినా పులుపు చావలేదు… అన్న సామెతను మీరు వినే ఉంటారు. ఆయా సందర్భాల్లో దీన్ని మనం పోలిక కోసం ఉపయోగిస్తుంటాం. అయితే పులుపు సంగతి ఎలా ఉన్నా చింతను తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. ప్ర ధానంగా ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ క్ర మంలో చింత చిగురును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

👉🏻 చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది.

👉🏻 ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట రాల్ను తగ్గించి అదే క్రమంలో మంచి కొలెస్ట రాల్ను పెంచుతుంది.

👉🏻 వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి.

👉🏻 చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.

👉🏻 వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది.

👉🏻 గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి.

👉🏻 కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది.

👉🏻 జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది.

👉🏻 చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి గా లభిస్తాయి. ఇందు వల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి.

👉🏻 పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.

👉🏻 తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.

👉🏻 థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

👉🏻 డయాబెటిస్ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

👉🏻 ఆల్కహాల్ను ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

👉🏻 చింత చిగురును పేస్ట్లా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది.

👉🏻 శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రిజెంట్లా పనిచేస్తుంది.

👉🏻 నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.

ప్రస్తుత పరిస్థితులలో పురుగుమందులు లేకుండా వందకు వందశాతం లభించేది ఇదేనేమో..
Image result for చింతచిగురు

Benefits of Eating Tamarind Leaves
 చింతచిగురు




Benefits of using Onion ఉల్లిపాయ(ఉల్లి గడ్డ )

Benefits of using Onion

ఉల్లిపాయ(ఉల్లి గడ్డ )
Image result for onion

ఉల్లిపాయను సంస్కృతంలో పలాండు అని, హిందీలో ప్యాజ్‌ అని, ఇంగ్లీషులో ఆనియన్‌ అని అంటారు.
ఉల్లి చేసే మేలు తల్లి కుడా చేయదనే సామెత ఉన్నది

తెల్ల ఉల్లిపాయ రసాన్ని నాలుగు నుండి ఆరు టీస్పూన్ల మోతాదులో రోజుకు రెండు లేదా మూడుసార్లు వాడితే శరీరం లోపల జరిగే అంతర్గత రక్తస్రావాలు తగ్గుతాయి. తెల్ల ఉల్లిపాయ ముక్కలను మజ్జిగలో కలుపుకొని తాగుతూ ఉన్నా చక్కని గుణం కనిపిస్తుంది.

నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసానికి ఒక చిటికెడు పొంగించిన ఇంగువ పొడిని, ఒక చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజుకు అవసరాన్నిబట్టి రెండూ లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే పొట్ట ఉబ్బరింపు, పొట్ట నొప్పి, గ్యాస్ తగ్గుతాయి.

ఉల్లి రసానికి తగినంత తేనె కలిపి కంట్లో చుక్కల మందుగా వేసుకుంటూ ఉంటే కంటి చూపు పెరుగుతుంది.

ఒకటి నుండి రెండు టీస్పూన్ల ఉల్లిపాయ రసానికి రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని, చిటికెడు ఉప్పును కలిపి అవసరాన్ని బట్టి రెండు లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే కడుపునొప్పి తగ్గుతుంది.

ఒకటి నుండి రెండు ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌కు కలిపి తింటే ఆమాశయం, జీర్ణ అవయవాలు శక్తివంతం అవుతాయి.

రెండు నుండి నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసాన్ని రోజుకు మూడు లేదా నాలుగుసార్లు మూడు నెలలపాటు తాగితే మూత్రపిండాల నొప్పి, పొత్తికడుపులో నొప్పి, పేగులలో పురుగులు, మూత్ర వ్యవస్థలో రాళ్లు తయారవటం వంటి అన్ని సమస్యలు తగ్గుతాయి.

ఒకటి లేదా రెండు తెల్ల ఉల్లిపాయలను చిన్నగా తరిగి నీళ్లలోవేసి మరిగించి తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది.

ఉల్లిపాయ రసాన్ని, సున్నం నీళ్లను సమభాగాలుగా కలిపి పూటకు రెండు టీస్పూన్ల వంతున మూడు పూటలా తాగితే కలరాలో నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.

25 గ్రాముల ఉల్లిపాయ ముక్కలను, 6 మిరియం గింజలను మెత్తగా దంచి గుడ్డలో వేసి రసం పిండండి. దీనిని ఎంత వీలైతే అంత తాగండి. అవసరం అనుకుంటే దీనికి పటికబెల్లం పొడిని కలపవచ్చు. దీంతో ప్రాణ ప్రమాదాన్ని కలిగించే కలరా లక్షణాలు తగ్గుతాయి.

అసాధ్యమైన కలరా వ్యాధిలో రోగి మగతగా పడుకొని నీళ్లు కూడా తాగలేని స్థితిలో ఉన్నప్పుడు 250 మిల్లీగ్రాముల కర్పూరం పొడిని నోట్లో వేసి వెంటనే 2 టీస్పూన్ల ఉల్లిపాయ రసాన్ని పోయండి. దీంతో ఎంతటి తీవ్రమైన కలరా వ్యాధిలోనైనా ఫలితం కనిపిస్తుంది.

ప్రతి 10 లేదా 15 నిమిషాలకు ఒకసారి ఉల్లిపాయ రసాన్ని తాగగలిగినంత రోగి చేత తాగిస్తూ ఉంటే కలరా వ్యాధి ఉపశమిస్తుంది.

ఒక టీస్పూన్ ఉల్లిపాయ రసం, ఒక టీస్పూన్ ఆవునెయ్యి, అర టీస్పూన్ తేనెలను కలిపి ఉదయం, సాయంకాలం చప్పరిస్తూ రాత్రిపూట పాలు తాగుతూ ఉంటే సిఫిలిస్ వ్యాధి, మూత్రాధిక్యత అతి మైధునంతో ఏర్పడిన నపుంసకత తదితర సమస్యలు అన్నీ తగ్గుతాయి.

ఉల్లిరసాన్ని, నెయ్యిని సమభాగాలుగా కలిపి దీనిని ఒక టీస్పూన్ మోతాదుగా మూడుపూటలా తీసుకోండి. దీనితో శారీరక బలహీనత దూరమవుతుంది.

ఉల్లిపాయను మెత్తని గుజ్జుగా నూరి మొలల మీద, జారిన మలాశయం మీద లేపనంగా పూసుకుంటే మొలల్లోని వాపు, దురద, నొప్పి తగ్గుతాయి.

మండే నిప్పు కణికల మీద రెండు ఉల్లిపాయలను వేయించి పైపొట్టు తీసి లోపలి పాయలను నూరి ముద్దగా చేసి మలద్వారం చుట్టూ తయారైన చీముగడ్డల మీద కట్టుకోండి. దీనితో వెంటనే పైల్స్‌లో వాపు, దురద, మలద్వారంలో నొప్పి వంటివి తగ్గుతాయి.

125 మి.లీ. ఉల్లిరసానికి నాలుగు టీస్పూన్ల పటికబెల్లం పొడిని కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండండి. ఇది రక్తస్రావంతో కూడిన మూలవ్యాధిలో అమోఘంగా పనిచేస్తుంది. దీంతో రక్తస్రావం త్వరితగతిన ఆగుతుంది.

పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది.
Image result for onion

Benefits of using Onion

ఉల్లిపాయ(ఉల్లి గడ్డ )

Waste Segregation: One Bin for Each, One Step Toward a Cleaner Future

  Waste Segregation: One Bin for Each, One Step Toward a Cleaner Future Urbanization and fast-paced lifestyles have increased the amount of...