Friday, April 17, 2020

18 Benefits of eating jaggery/Bellam

బెల్లం తినడం వల్ల కలిగే18 ప్రయోజనాలు

18 Benefits of eating jaggery/Bellam


1.బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది

2.భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే  మనం ఆరోగ్యం గా ఉండవచ్చు.

3.జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది

4 బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి  చేసి మెటబొలిజం ని క్రమబద్దీకరణ చేస్తుంది.ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి.

5.బెల్లం లో వుండే ప్రముఖ ధాతువు ఇనుము. కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమైనది.

6.చర్మం కోసం, బెల్లం రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్ల ను దూరం చేసి చర్మానికి మంచి మెరుపు నిచ్చి మొటిమలు ని నివారిస్తుంది
.
7.బెల్లం యొక్క గుణం వేడిచేయడం.కావున దీనిని మనం జలుబు ,దగ్గు, రొంప
లాంటివాటికి ఉపశమనం ఇస్తుంది.జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డు లో కూడా వాటిని కలిపి సేవించవచ్చు.

8.శక్తి కోసం, బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే,బెల్లం సేవించినట్లయితే మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసట గా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినేయండి.

9.బెల్లం శరీర ఉష్ణోగ్రత ని నియంత్రణ లో ఉంచుతుంది. దీని ఆంటి అలెర్జీక్ తత్వం వలన దమ్ము ఆస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.

10.మోకాళ్ళ నొప్పుల కి విశ్రాంతి, బెల్లం ముక్క తో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.

11.బెల్లం తో కలిసి చేసిన పరమాన్నం తింటే గొంతు మరియుమాట హయిగా వస్తాయి.

12.బెల్లాన్ని నల్లనువ్వుల తో పాటు లడ్డు చేసుకోని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు.

13.శీతకాలంలో నంజు బాగా తయారైతే బెల్లాన్ని పాపిడి రూపంలో చేసుకుని సేవించండి.

14.బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకొంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.

15.భోజన ము తర్వాత బెల్లం తీసుకొంటే అసిడిటీ తగ్గిపోతుంది

16.ఐదు గ్రాముల శొంఠి పది గ్రాముల బెల్లం ఉండలు గా చేసి తీసుకొంటే జాండిస్ (పీలియావ్యాధి)పచ్చ కామెర్లు  వారికి లాభసాటిగా ఉంటుంది.

17.బెల్లం హాల్వా తీసుకొంటే  జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

18.అయిదు గ్రాముల బెల్లం అంతే పరిమాణంలో ని ఆవాల నూనె( మస్తర్డ్ ఆయిల్) తో కలిపి తీసుకొంటే శ్వాస సంభందిత వ్యాధులు నయమవుతాయి.

18 Benefits of eating jaggery/Bellam

జీర్ణశక్తిని వృద్ధిచేసే సులభ ఔషదాలు



జీర్ణశక్తిని వృద్ధిచేసే సులభ ఔషదాలు 

*********

   శరీరంలో వ్యాధులు రావడానికి ప్రధమ కారణం జీర్ణశక్తి సక్రమంగా లేకపోవడమే జీర్ణశక్తిని వృద్ధి చేసుకుంటే వ్యాధులు దరిచేరవు . సమయానికి తగు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే పుష్టిగా , బలంగా ఉండవచ్చు.

            కొంతమందికి ఒక వయస్సు దాటిన తరువాత జీర్ణశక్తి లోపించడం జరుగుతుంది. వెంటనే వారు ఆయా ఔషదాలు ఉపయోగించుకొని జీర్ణశక్తిని వృద్ది చేసుకోవాలి.

            జీర్ణశక్తిని వృద్దిచేసే కొన్ని ప్రత్యేక ఔషధాలను మీకు వివరిస్తాను.

    శొంఠికొమ్ములను నిప్పులమీద కాల్చవలెను . శొంఠి నిప్పులమీద కాల్చినప్పుడు శుద్ది అగును. కాల్చిన శొంఠిని మెత్తటి చూర్ణంగా చేసి ఒక కప్పు మోతాదులో దానిని తీసుకుని ఆ చూర్ణం మునిగేంతవరకు గింజలు తీసివేసిన నిమ్మరసాన్ని పోయాలి. ఈ విధంగా శొంఠిపొడిని మూడు రోజులపాటు నిమ్మరసంలో నానబెట్టి తరువాత ఒక కప్పు పంచదార దానికి కలిపి పొయ్యిమీద పెట్టి పాకంపట్టి పాకం బిగుసుకున్నాక తరువాత గోళీలు అంత ఉండలు చేసి నిలువచేసుకొని ప్రతి రోజు రెండు ఉండల చొప్పున తీసుకుంటూ ఉంటే అమితమైన జీర్ణశక్తి కలుగును.

   ఎండు ద్రాక్షా , కిస్మిస్ లను గాని తీసుకుని దానికి సమానంగా తేనె మరియు పంచదార కలిపి బాగా నూరి ఒక సీసాలో భద్రపరచుకొని రోజూ ఒక చెంచా ఔషధాన్ని మూడు పూటలా తీసుకుంటూ ఉంటే అజీర్ణవ్యాధి తగ్గిపోతుంది.

   అల్లం మెత్తగా దంచి దాంట్లో కొంచం సైన్ధవ లవణం కలిపి ఒక సీసాలో ఉంచుకొని రోజూ అన్నం లో మొదటి ముద్దలో ఒక చెంచా వేసుకొని కొంచం నేతిని కూడా కలిపి తీసుకుంటూ ఉండాలి . దీనివల్ల జీర్ణశక్తి బాగా వృద్ది చెందును .

    కరివేపాకు , కొత్తిమీర , పుదినా , చింతచిగురు , చింతపూలు , తులసి ఆకులు ఎక్కువుగా తినడం వలన జీర్ణశక్తి శాశ్వతంగా బాగుంటుంది.

   శొంఠిని కాల్చి ధనియాలు , జీలకర్ర , మిరియాలను కలిపి బాగా నూరి కొంచం ఉప్పు కలిపి అన్నంలో మొదటి ముద్దలో తిన్నా లేదా మజ్జిగలో కలిపి త్రాగినా జీర్ణశక్తి పెరుగును.

    పిప్పిళ్లు కొంచం నెయ్యివేసి  వేయించి చూర్ణం చేసుకుని ఒక కప్పు పొడిని తీసుకుని ఆరుకప్పుల పంచదార పాకం పట్టి పిప్పిళ్ళపొడి పోస్తూ కలపాలి . బాగా బిగుసుకున్న తరువాత చల్లార్చి గోలీలంత  ఉండలు చేసుకుని ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు పిల్లలు అయితే ఒకటి , పెద్దలు అయితే రెండు చొప్పున రెండు పూటలా తిని పాలు తాగుతున్న జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. లివర్ సమస్య ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనం అవుతుంది. ప్రేగులకు మంచి బలాన్ని ఇస్తుంది. జిగట విరేచనాలు అవుతున్న సమయంలొ ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.

   కరక్కాయ , పిప్పిళ్లు , శొంఠి , వాము , సైన్ధవలవణం వీటిని సమభాగాలుగా తీసుకుని శొంటిని నిప్పుల మీద కాల్చాలి. పిప్పిళ్ళని నేతిలో వేయించాలి , కరక్కాయలను లోపలి గింజలు తీసివేసి అన్నిటిని కలిపి బాగా దంచి పొడి చేసుకుని రోజూ అన్నంలో నేతిని కలుపుకుని తింటూ వుంటే జీర్ణశక్తి అమితంగా పెరుగును .

      పైన వివరించిన యోగాలలో మీకు సులభంగా అనిపించిన  వాటిని ఉపయోగించుకుని జీర్ణశక్తిని పెంచుకోగలరు


జీర్ణశక్తిని వృద్ధిచేసే సులభ ఔషదాలు 

మిరియాలు - ( Benefits of Pepper )



మిరియాలు -  ( Benefits of Pepper )

*********

  మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్లో దగ్గు తగ్గుతుంది.

వీటిలో ఉండే పైపరిన్‌ అనే రసాయనం.. రొమ్ము కేన్సర్‌ కణితి ఉన్న వారిలో అది పెరిగే వేగాన్ని నియంత్రిస్తుంది.

ఆహార పదార్థాల్లో వీటి పొడిని చే రిస్తే, చెమట, మూత్ర విసర్జన బాగా జరిగి శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటికి వె ళ్లిపోతాయి.

మిరియాలు -  ( Benefits of Pepper )


మిరియాలు యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తాయి.

వీటిల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రత్యేకించి ఎముకల దృఢత్వాన్ని పెంచే గుణం ఉంది. అలాగే, కీళ్ల వాపును, ఆస్తమాను తగ్గించే శక్తి కూడా ఉంది.
మిరియాలకు జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్‌ ఆసిడ్‌ను వృద్ధి చేసే శక్తి ఉంది. దీనివల్ల జీర్ణశక్తి చక్కబడుతుంది
.
కడుపు ఉబ్బరం సమస్య కూడా మిరియాలతో చాలా వరకు త గ్గుతుంది
.
వీటిల్లో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్‌ అంశాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌, బ్యాక్టీరియాల కారణంగా వచ్చే పలు వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి.

దంతాలనొప్పినీ, దంతక్షయాన్నీ తగ్గించే గుణం కూడా మిరియాల్లో ఉంది.

మిరియాలతో చేసిన టీ, కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచి, అజీర్ణం మరియు మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

 చేపలో ఉన్నట్టుగా, మిరియాలతో చేసిన టీలో కూడా ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.
 ప్రతి రోజు పెరిగే ఒత్తిడి వలన శరీర జీవక్రియపై ప్రతికూల ప్రభావం కలగవచ్చు ముఖ్యంగా బరువు తగ్గించుకోవాలనుకునే సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన ఒత్తిడిని మిరియాల టీ తాగటం ద్వారా తగ్గించుకోవచ్చు.
మిరియాలతో చేసిన టీ విటమిన్ ‘C’ని కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా, సాధారణ స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది.

మిరియాలు -  ( Benefits of Pepper )

మిరియాలు -  ( Benefits of Pepper )

Health Benefits of Lemon

Health Benefits of Lemon



Home Remedies for Cough

Home Remedies for Cough


Benefits of Curd



Benefits of Curd


Tips for Kidney stones


Tips for Kidney stones


Tips for Kidney stones
Tips for Kidney stones

Benefits of Coconut oil

Benefits of Coconut oil


Benefits of Coconut oil
Benefits of Coconut oil
Benefits of Coconut oil

Waste Segregation: One Bin for Each, One Step Toward a Cleaner Future

  Waste Segregation: One Bin for Each, One Step Toward a Cleaner Future Urbanization and fast-paced lifestyles have increased the amount of...