Saturday, April 28, 2018

ఎందుకు చల్లని నీరు త్రాగకూడదు? Why do not we drink cold water?



ఎందుకు చల్లని నీరు త్రాగకూడదు?

Image result for cold water

ఎల్లప్పుడూ చల్లని నీళ్ళు త్రాగకూడదు. మన శరీరం యొక్క ఉష్ణోగ్రత 37 డిగ్రీలు , అలా నీటిని కూడా 37 డిగ్రీల ఉష్ణోగ్రతతో తీసుకుంటే ఆ నీరు గోరు వెచ్చగా ఉంటుంది. ఎప్పుడూ గోరు వెచ్చని నీటీనే త్రాగాలి.

ఫ్రిజ్ నీటిని , ఐస్ ముక్కలు వేసిన నీటిని త్రాగకూడదు. ఎందుకంటే చల్లని నీరు పొట్టలోకి వెళ్ళి పొట్టని చల్ల బరుస్తుంది. శరీరంలోని అన్ని భాగాలకు పొట్టతో సంబంధం ఉంది. దాని వలన శరీరమంతా చల్ల బడుతుంది. ఇది చాలా ప్రమాదకరము. చల్లని నీరు త్రాగితే పొట్ట ఆ నీటిని వేడి చేసే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల శరీరంలోని రక్తమంతా పొట్ట భాగానికి చేరి మిగిలిన అవయవాలకి రక్తం సరఫరా తగ్గి పోతుంది. ఇలా తరచూ చల్లని నీటిని త్రాగటం వలన అవయవాలన్నిటికీ అంటే గుండె కీ, మెదడుకి చేరవలసిన రక్తం సరిగా చేరక పోవటం వలన బ్రైన్ హేమరేజ్, పేరాలసిస్, గుండె పొటు వంటి ప్రమాదాలు జరగ వచ్చును. కొందరికి విరేచనం సాఫీగా అవ్వదు.

ఫ్రిజ్ లోని నీరు , వస్తువులు తీసుకోకండి. ఐస్ క్రీమ్స్ వంటి చల్లని పదార్ధాలు తినడం మంచిది కాదు.

పెళ్ళి భోజనాలు వంటి చోట వేడి వేడి భోజనం పెడతారు. చివరికి చల్లటి ఐస్ క్రీమ్ ఇస్తారు. ఇది మహాక్రూరపు చర్య ఇలా ఎప్పుడూ చెయ్యకండి.

అల్యూమినియం , ప్లాస్టిక్ పాత్రలలో నీటిని నిల్వ ఉంచరాదు , త్రాగరాదు.

" ఆరోగ్య మే ---- మహాభాగ్యం "

No comments:

Post a Comment

Waste Segregation: One Bin for Each, One Step Toward a Cleaner Future

  Waste Segregation: One Bin for Each, One Step Toward a Cleaner Future Urbanization and fast-paced lifestyles have increased the amount of...