Health Benefits of eating Guava
జామపండు - ఆరోగ్య రహస్యాలు..
*********జామపండు ను ఆంధ్రా యాపిల్, పేదవాడి యాపిల్ అని కూడా అంటారు. రోజూ ఒక యాపిల్ తినండి డాక్టర్ కు దూరంగా ఉండండి అని వినే ఉంటాం. అలాగే ఈ ఆంధ్రా యాపిల్ లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కాశ్మీర్ యాపిల్ కంటే ఎక్కువ ప్రయోజనాలు...
కొన్ని ఉపయోగాలు...
వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. జామపండును ఆహారం తీసుకున్న తరువాత తినడం ఉత్తమం.
భోజనానికిముందు జామపండు తినాలనుకుంటే, భోజనం చేయడానికి కనీసం రెండు గంటల ముందు తినాలి.
అతితక్కువ క్యాలరీలు, తక్కువ కొలెస్ట్రాల్ కలిగి , ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు.
ఎక్కవ పీచుపదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
వయసుకు ముందే ముఖం పై ముడతలు , చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది.
ఏ,బీ,సీ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
కంటి సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది. స్త్రీలలో రుతుచక్ర సమస్యలు , బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.
జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి , అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
విటమిన్ ఎ , ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్ , లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు , చర్మానికి, కంటికి చాల మంచిది అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయ లో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది.
జామకాయ లో ఉండే పొటాషియం గుండె జబ్బులు, బీపి పెరగకుండా చేస్తాయి.
అంతే కాకుండా జమకాయలో బి కాంప్లెక్స్ విటమిన్స్ (బి6 , బి9 ) , ఈ, కె విటమిన్స్ ఉంటాయి.ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.
బాగామాగిన జామపండులో....
బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు.ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు.
గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.
జామపండు చెట్టులోని ఆకులను (కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు

No comments:
Post a Comment