Benefits of using Onion
ఉల్లిపాయ(ఉల్లి గడ్డ )
ఉల్లిపాయను సంస్కృతంలో పలాండు అని, హిందీలో ప్యాజ్ అని, ఇంగ్లీషులో ఆనియన్ అని అంటారు.
ఉల్లి చేసే మేలు తల్లి కుడా చేయదనే సామెత ఉన్నదితెల్ల ఉల్లిపాయ రసాన్ని నాలుగు నుండి ఆరు టీస్పూన్ల మోతాదులో రోజుకు రెండు లేదా మూడుసార్లు వాడితే శరీరం లోపల జరిగే అంతర్గత రక్తస్రావాలు తగ్గుతాయి. తెల్ల ఉల్లిపాయ ముక్కలను మజ్జిగలో కలుపుకొని తాగుతూ ఉన్నా చక్కని గుణం కనిపిస్తుంది.
నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసానికి ఒక చిటికెడు పొంగించిన ఇంగువ పొడిని, ఒక చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజుకు అవసరాన్నిబట్టి రెండూ లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే పొట్ట ఉబ్బరింపు, పొట్ట నొప్పి, గ్యాస్ తగ్గుతాయి.
ఉల్లి రసానికి తగినంత తేనె కలిపి కంట్లో చుక్కల మందుగా వేసుకుంటూ ఉంటే కంటి చూపు పెరుగుతుంది.
ఒకటి నుండి రెండు టీస్పూన్ల ఉల్లిపాయ రసానికి రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని, చిటికెడు ఉప్పును కలిపి అవసరాన్ని బట్టి రెండు లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే కడుపునొప్పి తగ్గుతుంది.
ఒకటి నుండి రెండు ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌కు కలిపి తింటే ఆమాశయం, జీర్ణ అవయవాలు శక్తివంతం అవుతాయి.
రెండు నుండి నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసాన్ని రోజుకు మూడు లేదా నాలుగుసార్లు మూడు నెలలపాటు తాగితే మూత్రపిండాల నొప్పి, పొత్తికడుపులో నొప్పి, పేగులలో పురుగులు, మూత్ర వ్యవస్థలో రాళ్లు తయారవటం వంటి అన్ని సమస్యలు తగ్గుతాయి.
ఒకటి లేదా రెండు తెల్ల ఉల్లిపాయలను చిన్నగా తరిగి నీళ్లలోవేసి మరిగించి తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది.
ఉల్లిపాయ రసాన్ని, సున్నం నీళ్లను సమభాగాలుగా కలిపి పూటకు రెండు టీస్పూన్ల వంతున మూడు పూటలా తాగితే కలరాలో నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.
25 గ్రాముల ఉల్లిపాయ ముక్కలను, 6 మిరియం గింజలను మెత్తగా దంచి గుడ్డలో వేసి రసం పిండండి. దీనిని ఎంత వీలైతే అంత తాగండి. అవసరం అనుకుంటే దీనికి పటికబెల్లం పొడిని కలపవచ్చు. దీంతో ప్రాణ ప్రమాదాన్ని కలిగించే కలరా లక్షణాలు తగ్గుతాయి.
అసాధ్యమైన కలరా వ్యాధిలో రోగి మగతగా పడుకొని నీళ్లు కూడా తాగలేని స్థితిలో ఉన్నప్పుడు 250 మిల్లీగ్రాముల కర్పూరం పొడిని నోట్లో వేసి వెంటనే 2 టీస్పూన్ల ఉల్లిపాయ రసాన్ని పోయండి. దీంతో ఎంతటి తీవ్రమైన కలరా వ్యాధిలోనైనా ఫలితం కనిపిస్తుంది.
ప్రతి 10 లేదా 15 నిమిషాలకు ఒకసారి ఉల్లిపాయ రసాన్ని తాగగలిగినంత రోగి చేత తాగిస్తూ ఉంటే కలరా వ్యాధి ఉపశమిస్తుంది.
ఒక టీస్పూన్ ఉల్లిపాయ రసం, ఒక టీస్పూన్ ఆవునెయ్యి, అర టీస్పూన్ తేనెలను కలిపి ఉదయం, సాయంకాలం చప్పరిస్తూ రాత్రిపూట పాలు తాగుతూ ఉంటే సిఫిలిస్ వ్యాధి, మూత్రాధిక్యత అతి మైధునంతో ఏర్పడిన నపుంసకత తదితర సమస్యలు అన్నీ తగ్గుతాయి.
ఉల్లిరసాన్ని, నెయ్యిని సమభాగాలుగా కలిపి దీనిని ఒక టీస్పూన్ మోతాదుగా మూడుపూటలా తీసుకోండి. దీనితో శారీరక బలహీనత దూరమవుతుంది.
ఉల్లిపాయను మెత్తని గుజ్జుగా నూరి మొలల మీద, జారిన మలాశయం మీద లేపనంగా పూసుకుంటే మొలల్లోని వాపు, దురద, నొప్పి తగ్గుతాయి.
మండే నిప్పు కణికల మీద రెండు ఉల్లిపాయలను వేయించి పైపొట్టు తీసి లోపలి పాయలను నూరి ముద్దగా చేసి మలద్వారం చుట్టూ తయారైన చీముగడ్డల మీద కట్టుకోండి. దీనితో వెంటనే పైల్స్‌లో వాపు, దురద, మలద్వారంలో నొప్పి వంటివి తగ్గుతాయి.
125 మి.లీ. ఉల్లిరసానికి నాలుగు టీస్పూన్ల పటికబెల్లం పొడిని కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండండి. ఇది రక్తస్రావంతో కూడిన మూలవ్యాధిలో అమోఘంగా పనిచేస్తుంది. దీంతో రక్తస్రావం త్వరితగతిన ఆగుతుంది.
పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది.
Benefits of using Onion
ఉల్లిపాయ(ఉల్లి గడ్డ )
ఉ
No comments:
Post a Comment